భగత్ సింగ్ జీవిత చరిత్రని స్ఫూర్తిగా తీసుకోవాలి – తెలకపల్లి సర్పంచ్ చంద్రశేఖర్

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – తెలకపల్లి

నేడు భగత్ సింగ్, సుగుదేవ్, రాజుగురు ల వర్ధంతి సందర్భంగా తెలకపల్లి యువకులు భగత్ సింగ్ వర్ధంతి కార్యక్రమాన్ని తెలకపల్లి నెహ్రూ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలకపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి, దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహా యోధులు భగత్ సింగ్, రాజు గురు మరియు సుఖదేవులు అని తెలిపారు.

జలియన్ వాలాబాగ్ రక్తపాతం చూసిన భగత్ సింగ్, చిన్ననాటి నుంచే ఎలాగైనా దేశానికి స్వాతంత్రం తేవాలని లక్ష్యం పెట్టుకున్నారని వారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నేటి యువకులకు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ ల జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకోవాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తెలకపల్లి నాయకులు గుగ్గిళ్ళ ప్రకాష్, తుమ్మ రామకృష్ణ, అర్జున్ , పరమేష్, బల్మూర్ మల్లేష్, గడ్డమీది ఆంజనేయులు, దర్శనాల సురేష్, రాము, శివశంకర్, శ్రీశైలం, తెలకపల్లి యువకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

బీసీలకువిద్యార్థులకు మొండిచేయి చూపిన బడ్జెట్.. ఓయూలో TRVS నిరసన..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles