- వచ్చే ఎన్నికల్లో తాండూరు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం:
- యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి
తాండూరు, ఆగస్టు 4 (బల భీమ న్యూస్):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “టీఆర్ఎస్ జెండా పండుగ” కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో తెలంగాణ రక్షణ సేన జెండాను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ కంచర్ల శివారెడ్డి, జెండా పండుగ రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ కోలా శ్రీనివాస్, జుక్కల్ ఇన్‌చార్జ్ రాజశేఖర్, తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వీరమణి తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు ఇందిరా చౌక్‌లోని బసవేశ్వరుడు, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు, అనంతరం అంబేద్కర్ చౌక్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కంచర్ల శివారెడ్డి మాట్లాడుతూ, తాండూరు నియోజకవర్గంలో తొలి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించడం సంతోషకరమని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామ గ్రామాన, గల్లీ గల్లీలో పార్టీ జెండాలను ఎగురవేస్తూ తెలంగాణ రక్షణ సేనను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.
నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తల బృందాన్ని తయారు చేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న “సామాజిక తెలంగాణ న్యాయ సభ”కు సుమారు 10 వేల మంది హాజరుకానున్నారని తెలిపారు. తాండూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు సాగుతామని చెప్పారు.
అదేవిధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధన కోసం కవితక్క చేపడుతున్న ఉద్యమం అభినందనీయమని పేర్కొన్నారు. రైల్ రోకో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఘనత కూడా కవితక్కకే దక్కుతుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



