ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

  • షాద్ నగర్ పట్టణ సీఐ సీతారాం వెల్లడి

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధిషాద్ నగర్

రిపోర్టర్లు మంటూ బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఘటన పై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పట్టణ సిఐ కె. సీతారాం వెల్లడించిన వివరాల మేరకు తేదీ 22 మార్చి 2026 నాడు గంగ బియాన్ అనే అతను ఫిర్యాదు మేరకు విట్యాల గ్రామ పరిధిలోని వ్వక్తి కి చెందిన పొలంలోని గుట్టాను చదును చేయమని అట్టి భూమి యాజమాని వారికి తెలుపగా వారు తేదీ 22.3. 2026 నాడు అట్టి ప్రాంతంలో పొలంలోని గుట్టాను చదును చేయగా మిగిలిన మట్టిని వారి యొక్క టిప్పర్లలో తీసుకుని షాద్ నగర్ వైపు వెళుతుండగా మార్గ మధ్యలో పీర్లగూడ దగ్గర చేరుకోగానే రెండు బైకుల పై వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా వచ్చి వారి యొక్క టిప్పర్లను ఆపినారు.

అంతటితో ఆగకుండా వారు ప్రెస్ ఆంధ్రజ్యోతి డిపార్ట్మెంట్ వాళ్ళము అని అట్టి టిప్పర్ డ్రైవర్లను బెదిరించి వారి దగ్గర నుంచి 20,000 డిమాండ్ చేసినారు. అటు డబ్బులు వారి దగ్గర లేవని చెప్పిన వినకుండా టిప్పర్ డ్రైవర్లను బూతులు తిట్టి చేతులతో కొట్టడమే కాకుండా వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు పేర్కొంటూ, షాద్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిఐ సీతారాం విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు . ఇకపై విలేకరులమంటూ ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన డబ్బులను డిమాండ్ చేసిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles