• బడ్జెట్‌లో ప్రభుత్వాలు బీసీలకు మొండిచేయి..

● రేవంత్ సర్కార్ పై టీఆర్పీ నాయకుల ఆగ్రహం..

● కామారెడ్డి హామీల అమలుకు నిరుగారుస్తున్నారని విమర్శలు..

● జిల్లా నాయకత్వంతో నల్ల బ్యాడ్జీలతో ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి.

● కరీంనగర్ జిల్లాలో భారీ ర్యాలీ, కలెక్టర్ కార్యాలయం ముట్టడి.

● అరెస్ట్ చేసి పోలీస్ ట్రెనింగ్ సెంటర్ కి తరలించిన పోలీసులు..

● రెడ్డి సీఎం రేవంత్ రాజీనామా చేయాలని అఖిల్ పాషా డిమాండ్..

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – కరీంనగర్ 

: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో బీసీలకు తగిన నిధులు కేటాయించలేదని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం మరియు రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా హాజరయ్యారు. పార్టీ నాయకులు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి, కన్లకు గంతలు కట్టుకొని నగరంలో గితభావన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.

పోలీసులు అప్రమత్తమై పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి నగరంలో ఉన్న సిటీ పోలీస్ ట్రెనింగ్ సెంటర్ కి తరలించారు. అనంతరం టీఆర్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా మీడియా తో మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్‌లో బిసిలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, అట్టి దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని రేవంత్ గుర్తుతెచ్చుకోవాలని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రతి ఏడాది బీసీల అభివృద్ధికి 20,000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుత బడ్జెట్‌లో కేవలం 12,000 కోట్లకే పరిమితం చేయడం అన్యాయమని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని చెప్పి పక్కన పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు బడ్జెట్‌లో కేవలం 3.86% మాత్రమే కేటాయించి అందులో పక్కా ఖర్చు చేసేది 1% మాత్రమే అని చెప్పుకొచ్చారు. అధిక శాతం ఉన్న బిసిలకు బడ్జెట్ విషయంలో న్యాయానికి విరుద్ధమని మండిపడ్డారు. బిసిలకు 51% బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం అంకెల గారడీతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.

రాష్ట్ర క్యాబినెట్‌లో బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదని, 16 మంది మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే బీసీ వర్గానికి చెందినవారని పేర్కొన్నారు. అదే సమయంలో తక్కువ శాతం ఉన్న వర్గాలకు అధిక ప్రాతినిధ్యం ఇవ్వడం అన్యాయమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాన్నీ నడిపించే రవ్వంత రెడ్డికి సిగ్గుషేరం ఉంటే బిసిలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని లేని పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని మంత్రుల ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ధ్యక్షులు గంగిపెళ్లి అరుణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు ఇరగదిండ్ల సురేశ్, మైనార్టీ ప్రెసిడెంట్ వాజిద్, ప్రధాన కార్యదర్శి అంకుష్, యూత్ ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీకాంత్, టౌన్ ప్రధాన కార్యదర్శి ఎగుర్ల రమేష్, మండల అధ్యక్షులు ఓర్సు రాజు, చెరుకు పైడయ్య, అమ్మిగళ్ల కుమార్, కిరణ్, ఇశ్రత్ శవాలి, కనుమల సరిత, విమల, చిగుర్ల మోహన్, కోట సమ్మయ్య, కొప్పుల వెంకటేష్, ఓర్సు కార్తీక్, దండుగల మోహన్, సల్లంగుల రాము, కృష్ణ, సత్తిష్, విజయ్, వంశీ తదితర నాయకులు పాల్గొన్నారు.

కృష్ణవేణి పాఠశాలలో ఘనంగా రంజాన్ వేడుకలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles