– వివాహం చేసుకున్నాడని నాపై దాడి
–భార్యను ఎందుకు కొట్టారని ప్రశ్నించగా నాపై దాడి చేసి చంపే కుట్ర చేశారు
– పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
– న్యాయం కావాలంటూ బాధితుడు ఆందోళన
శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – వికారాబాద్

ఓయ్ యువకుడు వివాహం చేసుకున్నాడని మనసులో కక్ష పెట్టుకొని అతని నుంచి తన అన్న కూతుర్ని ఎలాగైనా విడిపించాలని కక్ష సాధింపుతో ఇనుప తీసుకొని తలపై తీవ్రంగా గాయపరిచి హత్య చేసేందుకు కుట్రపడిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన..పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . పూర్తి వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా నవాబ్ పేట మండలం గండేడ్ గ్రామానికి చెందిన కావలి శివకుమార్ గత సంవత్సరం జూన్ 24 వ తేదీన అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకోవడం జరిగింది. తిరిగి మండల కేంద్రానికి వచ్చి నవాబ్ పేట పోలీస్ స్టేషన్లో మాకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేయడం జరిగింది .

పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం జరిగింది . కానీ అమ్మాయి తరఫు వాళ్ల బాబాయికి ఈ ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వీళ్ళపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతు నిత్యం వేధింపులకు గురి చేసేవాడని తెలిపారు. క్రమంలోనే మార్చి 18వ తేదీన బుధవారం రాత్రి 8 గంటల సమయంలో తన భార్యను తన బాబాయ్ విచక్షణ రహితంగా కొట్టడం జరిగిందని . .అందుకు శివకుమార్ నా భార్యని ఎందుకు కొట్టినవ్ అని ప్రశ్నించడంతో అతను అక్కడున్నటువంటి ఇనుప రాడు తీసుకొని తలపై తీవ్రంగా కొట్టి రక్తం వచ్చేటట్టు గాయపరచడమే కాకుండా నన్ను చంపేందుకు కుట్ర పన్నడం జరిగిందన్నారు . స్థానికులు విషయాన్ని గమనించి ఆ యువకుడిని వెంటనే వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో అక్కడ వైద్యులు చికిత్స చేశారు. దీనిపై శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . నాకు ప్రాణం అని ఉందిరక్షణ కల్పించాలని లేకపోతే నా భార్య బాబాయ్ చేతిలో చావే దిక్కు అంటూ కన్నీరు అవుతున్నాడు .




