బీజాపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఆటోను ఢీకొట్టిన కారు.. ఐదుగురికి తీవ్ర గాయాలు!

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్

వికారాబాద్ జిల్లా రాకంచర్ల సమీపంలోని బీజాపూర్ హైవేపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, ఆటోను బలంగా ఢీకొనడంతో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

​ప్రమాద వివరాల్లోకి వెళ్తే..

​వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని పలుగురాళ్ల తండా గ్రామపంచాయతీలోని గోప్యా నాయక్ తండా కు  చెందిన కిషన్ నాయక్ తన భార్య కవిత లు కలిసి గత నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ వెళ్లి అక్కడ కూలి పనులు చేస్తూ కిషన్ నాయక్ ఆటో నడుపుతూ తమ ముగ్గురు పిల్లలని పోషిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఆదివారం బొమ్మరాసిపేట మండలం బోట్లోని తండాలో ఓ శుభకార్యానికి వెళుతుండగా,  ఆటోను రాకంచర్ల గేట్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జవ్వగా, అందులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

​ పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉంది.

​ సమాచారం అందుకున్న ఎస్సై భరత్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పరిగి ఆసుపత్రికి తరలించారు . కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు

​ అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.

ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ-పెళ్లి.

పండుగ పూట కొడంగల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కష్టాలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles