పండుగ పూట కొడంగల్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కష్టాలు

 

TGSWRS రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ బాయ్స్ కొడంగల్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల కష్టాలు

తమ పిల్లలను చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులతో వాగ్వివాదాలకు దిగిన సిబ్బంది

TC లు ఇస్తాం మీ పిల్లలను తీసుకెళ్లండి అంటూ బెదిరింపులు

మహిళలు అని చూడకుండా అసభ్యంగా ప్రవర్తించిన సిబ్బంది

కొడంగల్ గురుకుల పాఠశాలలో దారుణం

శ్రీ భీమా న్యూస్కొడంగల్

పండుగ పూట కొడంగల్ పట్టణ శివారులోని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు చుక్క ఎదురయింది . ఉగాది పండుగ ను పురస్కరించుకొని పాఠశాల చదువుతున్న తమ పిల్లలకు ఇంట్లో చేసిన వంటకాలు ఇచ్చి గారాబంగా తినిపించేందుకు పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు ఆ గురుకుల పాఠశాలలో నీ వాచ్మెన్ గేటు తీయకపోగా మహిళలు అని చూడకుండా అసభ్యంగా మాట్లాడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసే గురి చేయడం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు . పండుగనాడు గురుకుల పాఠశాలలో ని అధ్యాపకులు అందరూ కూడా సెలవులపై వెళ్లడంతో ఒకరు ఇద్దరు ఇన్చార్జిలు మాత్రమే ఉండగా వారిని ప్రశ్నిస్తే మీ పిల్లలు మాకేంటి సంబంధం మీ పిల్లల ముడ్డిలు కడగడానికి ఇక్కడ ఉన్నామా అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు ఇవ్వడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు .

పండుగనాడు విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు స్నానాలు చేయలేదని వాళ్లు టైం కు తిన్నారో లేదో కూడా తెలియదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు . తామే స్వయంగా పాఠశాలకు వెళ్లి తమ విద్యార్థులకు స్నానాలు చేయిస్తే మీ పిల్లలతోటి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయని ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని TC ఇస్తాము గేట్ వుట్ అంటూ తమతో వాగ్వి వాదానికి దిగడం జరిగిందని వాపోయారు . తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారు ..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles