శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు…
ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం…
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం
రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ అందిస్తున్నాం
దేశంలోనే రైతుల విషయంలో అతి తక్కువ రుణభారం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ప్రకటించడం మనకు గర్వకారణం
తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే
అందుకే రూ.2 లక్షల రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశాం

18 వేల కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు చేశాం
ఈ నెల 22 న మరోసారి రైతుభరోసా నిధులను విడుదల చేయబోతున్నాం
రైతు సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పట్టుపడుతోంది
ధరణి భూతాన్ని తరిమేసి భూ భారతితో భూసమస్యలను పరిష్కరిస్తున్నాం
దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది
ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నా





