శ్రీ బల భీమా న్యూస్ – కొడంగల్

తెలంగాణ సంస్కృతికి ప్రతతీక అయిన న జడ కప్పు కోలాటం వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని వడ్డర్ గల్లీ లో ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీ చితారు పెరుమల దేవస్థాన భజన మండలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. రంగు రంగుల దారాలతో జడలు అల్లుతూ భజన పాటలకు అనుగుణంగా కోలాటం మాడే ఈ సాంప్రదాయ నృత్యం ఉగాది పండుగ వాతావరణాన్ని మరింత ఆనందమయం చేస్తుంది . జానపద పాటలు చిడతల ఆటలతో కలిసి కళాకారులు జడకొప్పు కోలాటం ఆడటం ఎంతో సంతృప్తినిస్తుంది. ఇది కొడంగల్ కళావైభవాన్ని ప్రతిబింబించే అద్భుతమైన నృత్య రూపం…




