ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి.

 

  • ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలి
    • కార్మికులకు పని భారం నుంచి విముక్తి కల్పించాలి
    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి
    • పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలి

Sri Bala Bheema News Desk – Tandur

ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలని TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ అన్నారు . బుధవారం స్థానిక విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ

TGSRTC మేనేజింగ్ డైరెక్టర్ గారు ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇక నుండి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంటు ఇవ్వవద్దని సర్కిలర్ జారీ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

ఆర్టీసీలో ఇప్పటికే చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న చిన్న చిన్న ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ను ఇకనుంచి ఇవ్వమని చెప్పడం సమంజసం కాదని ఆర్టీసీ కార్మికులందరూ దీనిని వ్యతిరేకిస్తారని అందువలన వెంటనే మేనేజింగ్ డైరెక్టర్ గారు దీనిని పునః పరిశీలించి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు చేసిన సర్కులర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

ప్రస్తుతము పని భారం పెరిగిపోయి అనేక ఇబ్బందులకు గురవుతున్న తరుణంలో ఇంకా కావాలంటే కొత్త రాయితీలు ప్రకటించాలని ఉన్నదాన్ని తీసివేసి ఆర్టీసీ ఉద్యోగులకు నిరుత్సహానికి గురి చేయవద్దని ఇప్పటికే చట్టవ్యతిరేక డ్యూటీలతో పెరిగిన పని వారంతో యాజమాన్యం వేధింపులతో సతమతం అవుతున్నారని, కార్మికులు చేసిన కష్టాన్ని గుర్తించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు దీనిపైన దృష్టి కేంద్రీకరించి ఇట్టి సర్కులర్ లను రద్దుచేయించి ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ లను కంటిన్యూ చేయాలని కోరారు.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles