సిసి రోడ్లు పాయే మట్టి రోడ్లు వచ్చే

శ్రీ భీమా న్యూస్కొడంగల్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం లోని కొడంగల్ పట్టణంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో గల్లి గల్లి కి సిసి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది . ఎంతో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం జరిగింది . కానీ రేవంత్ రెడ్డి పరిపాలనలో సొంత నియోజకవర్గంలో ఆంధ్ర కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా సిసి రోడ్లు తీసివేసి మళ్లీ పూర్వ వైభవం మట్టి రోడ్లు రావడంతో పలు కానివాసులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సిన దౌర్భాగ్య స్థితి ఏర్పడింది . అధికారులు కొడంగల్ పై ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారో ప్రజలకు ఏమి అర్థం కావడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ ను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి టెండర్లు వేసి ఎంతో అభివృద్ధి చేద్దామని సంకల్పంతో ముందుకు వెళ్తుంటే కొంతమంది కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధి కాస్త నీరు గారి పోతుంది దీనిపై తక్షణమే సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజల ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కొడంగల్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles