వావ్.. డూప్లెక్స్ ఇందిరమ్మ ఇల్లు !

  • పోచమ్మ తండాలో ఆదర్శంగా ఇందిరమ్మ ఇల్లు
  • గృహప్రవేశంతో మురిసిపోయిన గిరిజన పేదలు
  • సీఎం రేవంత్ కలలు సహకారం..
  • కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ప్రశంసలు

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్

సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని పేదల కల నెరవేరాలని ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకం కళ్ళారా కళ్ళు మిరుమిట్లు కొలిపిస్తుంది . ఈ ఇల్లును చూడగానే వావ్.. ఇది ఇందిరమ్మ ఇల్లే కాదు డూప్లెక్స్ ఇల్లులా ఉంది.. అంటూ గిరిజన పేదలు ఆనందంతో మురిసిపోతున్నారు. ఇది ఎక్కడో కాదు సీఎం సొంత నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న పోచమ్మ తండాలో.

 

శుక్రవారం లబ్ధిదారు కమ్లి బాయ్ రూపుల నాయక్ లు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం సర్పంచ్ ముడావత్ సునీత రాజు ఆధ్వర్యంలో కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ చేతుల మీద గృహప్రవేశం కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు గృహప్రవేశం చేసి లబ్ధిదారులు సర్పంచులు అభినందించారు.  సంప్రదాయ బద్ధంగా జరిగిన గృహప్రవేశంలో ఇందిరమ్మ ఇల్లును నిర్మాణాన్ని చూసి నివ్వెర పోయారు .

డబుల్ బెడ్ రూమ్ తో పాటు వంటగది హాలు బయట చూడముచ్చటగా కనిపిస్తున్నాయి పైకప్పులో కూడా డూప్లెక్స్ ఇల్లును ఏమాత్రం తీసుకోకుండా రంగురంగుల విద్యుత్ దీపాలతో కనువిందు చేయడం చూసి ఇది ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎంతో ఆదర్శమని అంటున్నారు. సర్పంచ్ చూపిన ప్రత్యేక చొరవను కొనియాడుతున్నారు. సీఎం గారికి కృతజ్ఞతలు అంటూ తండా ప్రజలు అభినందిస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles