శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థ హైదరాబాద్ వారిచే శ్రీ పరాబవ నామ సంవత్సర ఉగాది నంది అవార్డ్స్ పురస్కారాలు గురువారం హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గాన సభ చిక్కడపల్లిలో అంగరంగ వైభవంగా సాగాయి . ఈ సందర్భంగా పలు సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విద్యాపరంగా ఎంతో కృషి చేస్తున్న కొడంగల్ నవీన ఆదర్శ హై స్కూల్ ప్రిన్సిపాల్ డివి నరేష్ రాజుకు ఉగాది స్వర్ణనంది అవార్డును దించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ డివి. వెంకటయ్య ముదిరాజ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా శ్రీ దైవాజ్ఞ శర్మ సంఖ్యాశాస్త్ర నిపుణులు ,డాక్టర్ శ్రీ శివ నరసింహ స్వామి కేరళ ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీ మురళీధరన్ నంబత్రి కేరళ వారి చేతుల మీదుగా జాతీయ విద్యా రత్న అవార్డును అందుకు అవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత డాక్టర్ డివి. నరేష్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా నవీన ఆదర్శ పాఠశాల ఆధ్వర్యంలో చేస్తున్న సేవలను మరియు విద్యాపరంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందిస్తున్న సేవలను వారు కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఉగాది స్వర్ణానంది అవార్డులను అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు డి లక్ష్మి వెంకటయ్య, వైస్ ప్రిన్సిపాల్ సంతోష ,ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .

రీసెర్చ్ మెథడాలజీతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు
కొడంగల్ లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం


