ప్రొఫెసర్లు Dr . శివకుమార్ సింగ్, Dr .పర్వతాలు కొలుకుందా
కొడంగల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన
నీటి శుద్ధి రీసెర్చ్ పై విద్యార్థులకు దృశ్య రూప అవగాహన
శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

డిగ్రీ కళాశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థి ప్రయోగాత్మక పద్ధతులతో విద్యాభ్యాసన చేయాలని, అప్పుడే విద్యార్థుల నైపుణ్యాలు మరింత మెరుగుపడతాయని ప్రొఫెసర్లు Dr. శివకుమార్ సింగ్, Dr. పర్వతాలు కొలుకుందా అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు రీసర్చ్ మెథడాలజీ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఆసక్తికరంగా ఉండడంతో ముగ్ధులై ప్రత్యేక శ్రద్ధతో అవగాహనలో విలీనమయ్యారు . ప్రొఫెసర్లు పలు రకాల దృశ్య పద్ధతుల ద్వారా నీటి శుద్ధి రీసర్చ్, తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు.

ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో కాలుష్యం బారిన పడకుండా, క్యాన్సర్ వంటి ప్రమాదాలకు గురికాకుండా, ఎన్నో రకాల ఆధునిక పద్ధతులు ప్రయోగాలను ఉపయోగించి రీసెర్చ్ మెథడాలజీ ద్వారా విద్యార్థులు సైతం ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రజలకు ఉపయోగపడేలా తెలియజేసే పద్ధతులు ఎన్నో ఉన్నాయని చూపించారు. అలాగే ప్రతి విద్యార్థి రీసెర్చ్ మెథడాలజీ పట్ల చాలా అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం అన్నారు. విద్యా అనుభవాల్లో ప్రయోగాత్మక పద్ధతులు పాటించి రాణించాలన్నారు. విద్యార్థి దశలో ప్రయోగాత్మక అంశాలు వారి నైపుణ్యాలను పెంపొందిస్తాయని స్పష్టం చేశారు. విద్యార్థి చిన్నచిన్న ప్రయోగాలు ఎలా తయారు చేయాలో కూడా వివరించారు.

నేటి బోధన లో 50% బోధనకు, మరో 50% ప్రయోగాలకు కేటాయించడం జరిగిందన్నారు. వినూత్నమైన ఆలోచనలే విద్యార్థి యొక్క ప్రయోగాత్మక పునాదులవుతాయని వివరించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో అవసరమని రీసర్చ్ మెథడాలజీ గురించి వివరించారు. గ్రామీణ విద్యార్థులకు డిగ్రీ కళాశాలలు ప్రయోగశాలలుగా మార్చుకోవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతానికి కళాశాలలు ఏర్పాటు చేయడం అలాగే RJD ఎంతో ప్రోత్సాహం చూపటం, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి మరింత ప్రత్యేక శ్రద్ధను చూపుతూ విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోస్గి, తాండూర్, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, షాద్ నగర్, మద్దూర్ ఆయా కళాశాలల అధ్యాపకులు మరియు కొడంగల్ డిగ్రీ కళాశాల అధ్యాపక బృందం రాంబాబు తదితరులు ఉన్నారు .

కొడంగల్ లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం


