శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలకు దూరమవుతూ తీవ్రంగా నష్టపోతున్నామని లబోదిబోమంటూ కన్నీరు మున్నీరు అవుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును రాజుగా చూడాలనే సంకల్పంతో రైతులకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువస్తూ సబ్సిడీ రుణాలపై వ్యవసాయ పరికరాలను అందించడం ఎంతో శుభ సూచికమైనప్పటికీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గ కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు ఎలాంటి పథకాలు గాని, సబ్సిడీ పరికరాలు గాని నోచుకోకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోని కొడంగల్ మండల పరిధిలోకొంతమంది రైతులు వ్యవసాయ పరికరాల నిమిత్తం బ్యాంకులో డీడీలు కట్టి , అట్టి డీడీ కాఫీలను వ్యవసాయ అధికారులకు అందించి 5 రోజులు అవుతుందని రైతులు తెలిపారు. కానీ వ్యవసాయ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అట్టి డీడీలు ఆన్లైన్లో ఎంటర్ చేయకపోవడం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు . ప్రభుత్వ ఆన్లైన్ సైట్ బుధవారం సాయంత్రం 5 గంటలకు క్లోజ్ కావడంతో ఏమి చేయలేని పరిస్థితి మాకు దాపురించింది అంటూ ఆరోపించారు. ఇలాంటి నిర్లక్ష్యపు అధికారులను జిల్లా స్థాయి అధికారులు కూడా పట్టించుకోవడంలేదని ఇక రాష్ట్రస్థాయి అధికారులే నిఘాను ఏర్పాటు చేసి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు .
పాత కోడంగల్ తండాలో గిరిజన ఆణిముత్యాలు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్న శ్రీ బల భీమ న్యూస్ ఛానల్ ను ప్రతి ఒక్కరూ ఆదరించి అభిమానించాలని కోరుతూ మా ఛానల్ ను మీరందరూ కూడా తప్పకుండా Subscribe చేయండి, Follow చేయండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు .. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు..


