శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

తెలంగాణ శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ సామాజిక కార్యకర్త నిఖిల్ డే బృందం..తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను ప్రశంసించిన నిఖిల్ డే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చేపడుతున్న ప్రజా వాణి కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి తీసుకెళ్ళేందుకు ఈ భేటీలో సమాలోచనలు జరిగాయి.అందుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాజస్థాన్ ప్రభుత్వం చేపడుతున్న జన్ సూచన పోర్టల్ తరహాలో తెలంగాణ లోనూ ‘ప్రజా సూచన పోర్టల్ ‘ ఏర్పాటు చేయాలని చర్చ జరిగింది. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు సంబంధించిన వివరాలను ఒకే చోటఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచుతారు.ఐటీ శాఖ ద్వారా ఈ పోర్టల్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ గిగ్ వర్కర్స్ బిల్ ను నిఖిల్ డే ప్రశంసించారు. ఈ బిల్ దేశంలోనే చారిత్రాత్మకంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కొడంగల్ లో వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
రీసెర్చ్ మెథడాలజీతో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు


