కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన తిరుపతిరెడ్డి

శ్రీ బలభీమ న్యూస్,బొంరాస్ పేట :


బొమ్రాస్ పేట మండలం కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సీఎం సోదరుడు ఎనుముల తిరుపతిరెడ్డి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పేద ఇంటి ఆడబిడ్డలకు వరమని తిరుపతిరెడ్డి అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అందుకొని బాగుపడాలని ఆయన ఆకాంక్షించారు.

పేద రైతులకు అందించే రైతు భరోసా వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అందజేసి పేదల ప్రభుత్వంగా పేరందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి ఆర్ఐ శిరీష గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, వెంకట రాములు గౌడ్,అంజిల్ రెడ్డి నర్సింలు నాయుడు, మల్లేష్, మల్లికార్జున్,
అనంతరం మండల కేంద్రంలో సీనియర్ నాయకుడు రామచంద్రారెడ్డి సతీమణి అనారోగ్యంతో ఉండడంతో కుటుంబాన్ని సందర్శించి పలకరించారు. వైద్య ఆరోగ్య ఖర్చులకు కావలసిన ఇన్సూరెన్స్ తదితర విషయాలపై అరా తీశారు. మెరుగైన వైద్యం కోసం మరింత ప్రత్యేక కృషి చేస్తానని తిరుపతిరెడ్డి అన్నారు.

వికారాబాద్ జిల్లాలో అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

వికారాబాద్ జిల్లాలో అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం

 

పోలీసులపై ఇసుక మాఫియా దాడి.. పోలీస్ వాహనం ధ్వంసం

పోలీసులపై ఇసుక మాఫియా దాడి – వాహనం ధ్వంసం

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles