- జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా,
శ్రీ బల భీమ న్యూస్ డెస్క్ :
వికారాబాద్ జిల్లాలో అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ ఎస్కే.అన్వర్ పాషా తెలిపారు ఈ సందర్భంగా వారు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక ప్రతేక బృందాలతో గత వారం రోజుల నుండి మొత్తం 13 అక్రమ రవాణా కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.

యాలాల పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఎనిమిది ట్రాక్టర్లతో పాటు కరణ్ కోట్ ప్రాంతంలో అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా కలప రవాణా చేస్తున్న ఒక లారీని పట్టుకొని కేసు నమోదు చేసి అట్టి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. వారం రోజుల క్రితం నవాబ్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రమట్టి అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్న మూడు లారీలు సీట్ చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో అక్రమ రవాణా కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పడం జరిగింది. ఎక్కడైనా అనుమానాస్పద రవాణా కనిపించిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో సహా నిరంతరం తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

అక్రమంగా సహజ వనరులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంవత్సరంలో ఇప్పటివరకు టాస్క్ ఫోర్స్ అధికారులు జనవరిలో 22 కేసులు, ఫిబ్రవరిలో 9 కేసులు, మార్చిలో 20 కేసులు, మొత్తం ఈ 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 51 అక్రమ రవాణా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వికారాబాద్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సహజ వనరుల సంరక్షణకు పోలీసు శాఖ కట్టుబడి ఉండని జిల్లా ఎస్పీ స్పష్టం చేయడం జరిగింది.
కొడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు



