శ్రీ బల భీమ న్యూస్ – బషీరాబాద్ :

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో ఇసుక మాఫియా పెట్రేగిపోతూ అడ్డూ అదుపు లేకుండా అక్రమ రవాణా సాగిస్తున్నారు . ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో మండల పరిధిలోని ధమార్ చెడ్ నుంచి తాండూర్ వైపు అక్రమ ఇసుక రవాణా సాగుతున్నదని పక్క సమాచారంతో ఎస్సై శ్రీశైలం యాదవ్ తన బృందంతో పోలీసు వాహనంలో బయలుదేరగా రెండు ఇసుక ట్రాక్టర్ లను వెంబడించడం జరిగింది. ఇట్టి విషయాన్ని ముందే పసిగట్టిన అక్రమ వ్యాపారులు ఏకంగా పోలీసు వాహనాన్ని ఢీ కొట్టి ధ్వంసం చేసి ట్రాక్టర్ డ్రైవర్లు పరార్ కావడం వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది . ఈ దాడిలో పోలీసులకు ఎవరికి గాయాలు కాలేదని ధాడికి పాల్పడిన ట్రాక్టర్లను సీసీ టీవీ ఫుటేజ్ ల ద్వారా గుర్తించడం జరిగిందని, అట్టి వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. వీరితో పాటు కానిస్టేబుల్, హోమ్ గార్డ్ లు ఉన్నారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో టీపీసీసీ అధ్యక్షులు భేటీ



