కొడంగల్ రైతులకు వ్యవసాయం పై అవగాహనా -జిల్లా వ్యవసాయ అధికారి టి. రాజారత్నం

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధిబొంరాస్ పేట :

బొంరాస్ పేట మండల పరిధి లోని తుంకిమెట్ల లో ఆత్మ – బ్లాక్ టెక్నాలజీ టీమ్ కన్వీనర్ శంకర్ రాథోడ్ ఆధ్వర్యంలో మంగళ వారం తుంకిమెట్ల రైతు వేదికలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ( ఆత్మ) వారి సౌజన్యంతో కెపాసిటీ బిల్డింగ్ మరియు RPL( రికగ్నేషన్ ఆఫ్ ప్రీయర్ లెర్నింగ్ )నైపుణ్యత కొరకు , వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం పై రైతులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వికారాబాద్ గ్రంథాలయ చైర్మెన్ రాజేశ్ రెడ్డీ హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ మారుతున్న కాలనికి అనుగుణంగ వ్యవసాయం చేయాలని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు అన్ని మండల కేంద్రాల లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. తద్వారా రైతులకు, ప్రకృతి వ్యవసాయం , ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళించాలి ఆరోగ్యం కాపాడుకోవాలి తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి టి. రాజారత్నం మాట్లాడుతూ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై, కెపాసిట్ బిల్డింగ్ మరియు RPL శిక్షణ కార్యక్రమంలో రైతులకు సాంకేతిక పరమైన విషయాలు తెలియజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ రంగంల్లో వస్తున్న కొత్త పద్ధతులు , వ్యవసాయ యాంత్రీకరణలో నవీన మార్పులు మరియు నానో యూరియా, నానో Dap వంటి వాటిని ఉపయోగించుకోవసిన అవశ్యకత గురించి రైతులకు తెలియజేశారు.

వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా సబ్సిడీ పైన ఉన్న వివిధ ఇంప్లిమెంట్ గురించి వివరించారు . ఇంకా ఎవరైనా అవసరం ఉన్న రైతులు ఉంటే మీ మీ మండల కేంద్రాలలో అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు , ఈ శిక్షణా కార్యక్రమం రైతులకు ఎంత మేరకు అర్దం అయింది అనే కోణం లో రైతులకు , శిక్షణా కార్యక్రమం కు సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం నుంచి విచ్చేసిన శాస్త్రవేత్తలు డా. మధుశేఖర్ వరిలో అధిక దిగుబడి ఇచ్చే వంగడాల గురించి ఇతర పంటల సాగులో సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు ప్రకృతి వ్యవసాయం మరియు నూనె గింజల పంటల సాగు గురించి వివిధ రకాల పంటలకు వచ్చే వివిధ రకాల చీడపీడల గురించి వివరించారు

ఆర్గానిక్ ఫార్మర్ నారాయణ ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేస్తున్న పంటల గురించి ముఖ్యంగా కంది పంట పైన , వివిధ రకాల కాషాయాల గురించి వివరించారు. కోరమాండల్ శ్యామ్ సుందర్ నానో DAP, నానో యూరియా గురించి, ప్రస్తుతం సమాజంలో వాటి ప్రాముఖ్యత మరియు అవశక్యత ,గురించి రైతులకు తెలియ చేశారు .

వ్యోమిక్ (vyomic) హేమంత్ రాజు వ్యవసాయ రంగం లో డ్రోన్ పనితీరు,అవశ్యకత మరియు ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకట్ రాములు గౌడ్ కొడంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మల్లికార్జున్, నందార్ పూర్ సర్పంచ్ లక్ష్మి, మాజీ PACS చైర్మెన్ జయ కృష్ణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిములు గౌడ్, వ్యవసాయ అధికారులు , రైతులు పాల్గొన్నారు.

*పోలీసులపై ఇసుక మాఫియా దాడి.. పోలీస్ వాహనం ధ్వంసం*

*https://sribalabheema.com/720-2/*

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

https://whatsapp.com/channel/0029VaMeklqKmCPNf7P0hN3W

follow whatsapp channel

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles