ప్రభుత్వ హాస్పిటళ్లలో పోస్టుల భర్తీ – ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధిహైదరాబాద్ :

ప్రభుత్వ హాస్పిటళ్లలో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు సహా అవసరమైన అన్నిరకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ రెండు సంవత్సరాల్లో సుమారు 10 వేల పోస్టులను భర్తీ చేశామని, మరో 7 వేలకుపైగా పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చివరి దశలో ఉందని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ప్రభుత్వ హాస్పిటళ్లో డాక్టర్లు, సిబ్బందికి సంబంధించి శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో ఒకేసారి భారీ సంఖ్యలో మెడికల్ కాలేజీలు పెరిగాయని, దీంతో కాలేజీల్లో డాక్టర్ల కొరత ఏర్పడిందని మంత్రి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు అర్హత కలిగిన డాక్టర్లు లేకపోవడం వలన, ఆయా పోస్టుల భర్తీ ఇబ్బందిగా మారిందని మంత్రి వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడికల్ కాలేజీల్లో 1200 టీచింగ్ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేశామని, రెగ్యులర్ బేసిస్‌లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, ఏప్రిల్‌లో భర్తీ ప్రక్రియ పూర్తి అవుతుందని మంత్రి తెలిపారు.

తెలంగాణ వైద్య విధాన పరిషత్ హాస్పిటళ్లలో 1616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని, ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా మరో నెల రోజుల్లో పూర్తి అవుతుందన్నారు. ఇప్పటికే 7 వేలకుపైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, మరో 2312 పోస్టుల భర్తీ ప్రక్రియ ఏప్రిల్‌లో పూర్తి అవుతుందని మంత్రి వెల్లడించారు. గత రెండేళ్లలో కలిపి 1500లకు పైగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. దాదాపు అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ప్రైవేటు మెడికల్ షాపులపై మండలిలో సభ్యులు ప్రశ్నించగా.. తాము అధికారంలోకి వచ్చాక ప్రైవేటు షాపులకు పర్మిషన్లు ఇవ్వలేదని, అప్పటికే ఉన్న వాటిని సైతం తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకుని కొన్ని షాపులు కొనసాగుతున్నాయని, కోర్టు నుంచి అనుమతి రాగానే వాటిని కూడా తొలగిస్తామని మంత్రి తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలో మెడిసిన్ అందించే విధంగా, జనరిక్ మెడికల్ షాపులను ప్రోత్సహిస్తామని మంత్రి వివరించారు.

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

ప్రెస్ రిపోర్టర్లను అని చెప్పి దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేసిన వారిపై కేసు నమోదు

*పోలీసులపై ఇసుక మాఫియా దాడి.. పోలీస్ వాహనం ధ్వంసం*

*https://sribalabheema.com/720-2/*

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles