సీఎంకు అమలు చేసే దమ్ముందా ..?

  • సీఎంకు ఆరు గ్యారంటీల అమలు చేసే దమ్ముందా?
  • అంకెల గారడి బడ్జెట్ సంక్షేమం అభివృద్ధి కాదు మోసపూరితం

  • రైతులను వంచించే రేవంత్ ప్రభుత్వం

  • ఉచిత బస్సు తప్ప చేసిందేమీ లేదు
  • కొడంగల్ లో రుణమాఫీ చేసావా
  • స్కాం భూకబ్జా కుంభకోణాలు తప్ప సంక్షేమం శూన్యం
  • చెప్పేది బారాన చేసేది చారణ
  • కొడంగల్ లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

శ్రీ బలభీమ న్యూస్ ప్రతినిధి, కొడంగల్ :

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లో ఆరు గ్యారెంటీలు అమలు చేసే దమ్ముందా అంటూ కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ అంకెల గారడి తప్ప సంక్షేమ అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. ఆదివారం కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటల్లో ఉన్నందుకే కేంద్రంలో ఓడిపోయిందని రాష్ట్రంలో కూడా అడ్రస్ లేకుండా గల్లంత కావడం ఖాయమన్నారు.

కెసిఆర్ ప్రభుత్వం రెండు లక్షల కోట్లతో ఊహించని విధంగా రైతుబంధు, రైతు రుణమాఫీ, మహిళల సంక్షేమం, వికలాంగుల, వృద్ధులు, వితంతులు పింఛన్లు తోపాటు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు చేయడంతో పాటు 100 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని సైతం నిర్మించి చరిత్ర సృష్టించారని హర్షించారు. సీఎంగా కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలు పొందాయని ప్రశంసించారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో 3000 కోట్లకు పైగా బడ్జెట్ చూపించినప్పటికీ ఉచిత బస్సు తప్ప మరో సంక్షేమ పథకం అమలు చేయలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే దళిత, గృహలక్ష్మి, ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలతో పాటు తులం బంగారం అలాగే పెంచుతామన్న పింఛన్లు, రైతు భరోసా, రైతుబంధు తదితర సంక్షేమ పథకాలన్నీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రెండేళ్ల తర్వాత రైతుబంధు అమలులో కేవలం ఒక ఎకరానికి 6000 చొప్పున అమలు చేయడానికి అంగు ఆర్భాటాలతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ఆర్భాటాలకు సీఎం రేవంత్ రెడ్డి పెట్టింది పేరని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని, పార్టీ తరఫున ఉద్యమాలు చేపట్టి గ్రామాల వారిగా చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మధుసూదన్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, డాక్టర్ నవాజ్, మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, నర్మదా కిష్టప్ప, సముద్రమ్మ, మాఫీ వెంకటయ్య, పాత కోడంగల్ రాజశేఖర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

కొడంగల్ మెమ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

బడ్జెట్ లో ఆర్టీసీ కి చిన్నచూపు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles