ఇసుక దందా.. అధికారుల అండా!

  • సీఎం స్పందించి జిల్లా కలెక్టర్ ఎస్పీలను సస్పెండ్ చేయాలి
  • కాంగ్రెస్ అంటేనే అక్రమ దందాలు, స్కాంలు, భూకబ్జాలు, కుంభకోణాలు
  • కొడంగల్ లో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

శ్రీ బలభీమ న్యూస్ ప్రతినిధి, కొడంగల్ :

కొడంగల్ నియోజకవర్గంలో బొంరాస్ పేట, మద్దూరు, కొత్తపల్లి తదితర మండలాల్లో ఇసుక దందా రోజురోజుకు రెచ్చిపోతూ ఇసుక మాఫియా ముఠాలు కోట్లకు పరిగెత్తుతున్నాయని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి అండతోనే ఇసుక దందా చెలరేగిపోతుందని ఆరోపించారు. జిల్లాలో ఎక్కడా అక్రమాలు జరిగిన చర్యలు తీసుకుంటానని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఇసుక అక్రమ రవాణా పై చర్యలు తీసుకోవాలని లేదా సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో ఇసుక దందా జరుగుతోందని ఆరోపించారు. 100 కోట్ల కు పైగా కొడంగల్ నియోజకవర్గం లో ఇసుక దందా కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని పార్టీ తరఫున ఉద్యమాలు చేపట్టి గ్రామాల వారిగా చైతన్య కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వం మెడల్వంచుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మధుసూదన్ యాదవ్, మధుసూదన్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, డాక్టర్ నవాజ్, మాజీ ఎంపీపీ దయాకర్ రెడ్డి, నర్మదా కిష్టప్ప, సముద్రమ్మ, మాఫీ వెంకటయ్య, పాత కోడంగల్ రాజశేఖర్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

సీఎంకు అమలు చేసే దమ్ముందా ..?

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles