- హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు
- గిరిజనుల అభివృద్ధి ప్రదాత సీఎం రేవంత్
- కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్
శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / కొడంగల్ :
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి తిమ్మారెడ్డిపల్లిలో జరిగే సద్గురు శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ (బావాజీ) జాతర బ్రహ్మోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా (State Festival) ప్రకటించడం పట్ల గిరిజన సమాజం ఎంతో హర్షం వ్యక్తం చేస్తోందని కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మెన్ శంకర్ నాయక్ అన్నారు. బుధవారం వారు స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మద్దూర్ మండలంలోని సద్గురు శ్రీ గురు లోకమసంద్ మహారాజ్ (బావాజీ) జాతర బ్రహ్మోత్సవాలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ప్రక్రియలో చొరవ చూపిన కొడంగల్ నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతి రెడ్డి కడ (KADA) స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు .

ముఖ్యాంశాలు:
- జాతర ప్రాముఖ్యత: గిరిజనుల ఆరాధ్య దైవం బావాజీ జాతర ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనికి రాష్ట్ర పండుగ హోదా లభించడం వల్ల ప్రభుత్వ నిధులు మరియు మెరుగైన సౌకర్యాలు లభించే అవకాశం ఉందన్నారు.
- నాయకత్వం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాటలకే పరిమితం కాకుండా, చేతల్లో గిరిజనుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.
- కొడంగల్ లో : కొడంగల్ నియోజకవర్గం కేంద్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు టెన్త్ సేవలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఇప్పటికే కమ్యూనిటీ హాల్ కిచెన్ షెడ్ ప్రహరీ గోడ పనులు పూర్తికావడానికి రావడం జరిగిందని అన్నారు.

- కృతజ్ఞతలు: ఈ చారిత్రాత్మక నిర్ణయం పట్ల కొడంగల్ గిరిజన సమాజం మరియు భక్తులు ఉమ్మడిగా తమ కృతజ్ఞతలను చాటుతున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ జాతరకు మరింత అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని భక్తులు భావిస్తున్నారు.కార్యక్రమంలో సేవాలాల్ ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు సామ్యనాయక్, గిరిజన యూత్ కాంగ్రెస్ నాయకుడు పాండు నాయక్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద నందిగామలో వైభవంగా అంబా భవాని మాత వేడుకలు
కొడంగల్ మండలం నాగారంలో వైభవంగా దేవతా మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం


