శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

కొడంగల్ మండల పరిధిలోని నాగారం గ్రామంలోని పురాతన ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుందని గ్రామ సర్పంచ్ పట్లోళ్ల ప్రశాంతకుమారి మదనసింహారెడ్డిలు తెలిపారు. గురువారం ఉదయం 11:00 గంటలకు శివాలయం వద్ద ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన, అలాగే ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నవగ్రహాలు మరియు నాగుల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా గ్రామ పెద్దలు, భజన మండలి సభ్యులు, భక్తులు మరియు వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 3 రోజుల పాటు సాగనున్న పూజ కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా జరగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ యు మధుసూదన్, వార్డు సభ్యులు E.రాజు గౌడ్, మ్యాథరి శివప్ప, జి. వెంకటమ్మ, తిరుపతప్ప, శ్యామమ్మ, శ్యామప్ప, U.కమలమ్మ, హనుమంతులతో పాటు , మాజీ సర్పంచులు పట్లోళ్ల బస్వంత్ రెడ్డి, పట్లోళ్ల అంజిల్ రెడ్డి, ప్రముఖులు పట్లోళ్ల సుదర్శన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,B.మోహన్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, Y పెద్ద భీమిరెడ్డి, Y.చిన్న భీమిరెడ్డి, దేవేందర్ గౌడ్, తమ్మాలి పాండు, B.అనిల్ కుమార్, సాయిలు, U.బీమ్లు, నర్సింహులు, పెద్ద బందప్ప, చిన్న బంజప్ప, బుడ్డప్ప, జన్నప్ప, K.శంకరప్ప, D.పకీరప్ప, M.భోజప్ప, M. పకీరప్ప, M. అంజిలప్ప, D. కిష్టప్ప, గోపాల్, వెంకటప్ప, S. మల్కప్ప, S. నరసప్ప తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

నరయ్ విజయన్, మోదీ ఇద్దరూ ఒక్కటే: కేరళ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
నరయ్ విజయన్, మోదీ ఇద్దరూ ఒక్కటే: కేరళ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


