• అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల హల్చల్
  • అధికార పార్టీ నాయకుల వైపు మొగ్గు చూపుతున్న పోలీసులు

శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్

బొంరాస్ పేట మండల పరిధిలోని గిరిజన తండా అయినా బోట్లోని తండాలో రాజకీయ కక్షలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి. అధికార పార్టీ నాయకుడు ఎంపీపీ దేశానాయక్ వర్గీయులు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ గా ఓడిపోయారు. దీనికి కారణం ప్రతిపక్ష BRS పార్టీలో ఉన్న యువత గట్టి పోటీనిచ్చి సర్పంచు స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో అధికార పార్టీ నాయకులు BRS పార్టీ యువతను టార్గెట్ చేస్తూ రోజుకు రోజుకు నానా రకాలుగా హింసిస్తూ ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్నారని దీని తాండావాసులు నిత్యం భయాందోళనకు గురవుతున్నామని వాపోతున్నారు . సర్పంచ్ ఎన్నికల విజయోత్సవ ర్యాలీలలో ఇరుపార్టీల మధ్య గొడవ చేసుకుని పోలీసు ఫిర్యాదుల వరకు చేరుకున్నాయి. కాగా తాజాగా మరో ఘటన వెలుగు చూసింది మా వైస్ ఎంపీపీ దేశనాయక్ తమ దయాదులపై, మహిళలు అని చూడకుండా చేయి చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సైతం ఈ ఘటనపై స్పందించడం లేదని తాండావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పోలీసులు ఏకపక్ష ధోరణితో స్పందించడం లేదని BRS పార్టీ నాయకులు బాధితులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రాజకీయ కక్షపూరిత ఘటనలకు పాల్పడకుండా పోలీసులు, అధికారులు సమన్వయపరచాలని అప్పుడే గాని తాండాలో గిరిజనుల మధ్య శాంతి సమన్వయం ఏర్పడుతుందని భావిస్తున్నారు. లేనిచో మరింత దారుణ ఘటనలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు.

సీఎం నియోజకవర్గంలో వైద్యారోగ్యం అస్తవ్యస్తం: అంబులెన్స్ అందక వృద్ధురాలు మృతి!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles