- కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన
- సైకాలజిస్ట్ డి. శ్రీనివాస్
శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – కొడంగల్

విద్యార్థులు చదువుపై అశ్రద్ధ వహిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మనిషి జీవితంలో రియల్ లైఫ్ వేరు.. రీల్ లైఫ్ వేరు.. అని సైకాలజిస్ట్ డి. శ్రీనివాస్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ బి. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులకు ఐ. క్యూ. ఎ. సి మరియు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ సమక్షంలో భావోద్వేగా శ్రేయస్సు అను అంశంపై బాసర త్రిబుల్ ఐటీ కి చెందిన సైకాలజిస్ట్ డి. శ్రీనివాస్ చేత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మనిషి జీవితంలో భావోద్వేగాలు అనుకూల మరియు ప్రతికూల అనే రెండు అంశాలు ఉంటాయని, అవి తాత్కాలికమైనవి కానీ మనలో ప్రతికూల భావోద్వేగాలు ఆధిపత్యం వహించినప్పుడు వాటిని సరైన పద్ధతిలో నియంత్రించడం అతి ముఖ్యమైన విషయం అన్నారు.

మనిషి జీవితం రియల్ లైఫ్ పేరు, సినిమాలో నటించే రీల్ లైఫ్ వేరు అని ఇది విద్యార్థులు చాలా గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. మనము గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి తప్ప సినిమాలో నటించే రిల్ హీరోలగా కాదన్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతూ మనిషి జీవితాన్ని నాశనం చేస్తుందని వాటి దుష్ప్రభావాలను గుర్తించి వాటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆలోచనలు భావోద్వేగాలు మరియు వాటి చర్యలపై నియంత్రణ కలిగి ఉండాలన్నారు.

విద్యార్థి వైఖరిలో మార్పు ద్వారా అనుకూల ఫలితాలను సాధించవచ్చని , విద్యార్థులు ఎప్పుడైతే పరీక్షల పట్ల వ్యాకులత వదిలి ప్రణాళికతో చదివి ఒత్తిడిని జయించాలన్నారు. విద్యార్థులు పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొంటూ ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని , ఏదైనా సంఘటనకు వెంటనే ప్రతి చర్య చూపకుండా సమయానం పాటించి ముందుకెళ్లాలని పలు సలహాలు సూచనలు అందజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా తమ జీవితంలో బాధ్యతయుతంగా వ్యవహరిస్తూ వారి పట్ల గౌరవాన్ని నెలకొల్పుతూ కన్న తల్లిదండ్రుల ఆశలు ఆశయాలని నెరవేర్చుతూ క్రమ శిక్షణతో మెలగాలని కోరారు. కార్యక్రమంలో ఐ క్యూ. ఎ. సి కోఆర్డినేటర్ రాంబాబు, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ హరిప్రియ, కె రమేష్ బాబు, సోమ్లాలతో పాటు అధ్యాపక బృందం విద్యార్థుల తో పటు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికులకు ఫ్యామిలీ ప్లానింగ్ ఇంక్రిమెంట్ రద్దు సర్కులర్ ను ఉపసంహరించుకోవాలి.


