తెలంగాణకే ఆదర్శవంతంగా ఇందిరమ్మ ఇండ్లు

  • కొడంగల్ లో మోడల్ ఇండ్లను తలపిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు
  • కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్

శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధికొడంగల్

  • రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజక వర్గమైన కొడంగల్ మండల పరిధిలోని పోచమ్మ తండా గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ మూడవత్ సునీతరాజుల ఆధ్వర్యంలో 8 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగింది. అందులో భాగంగానే తండా లో మోడల్ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడం ఎంతో సంతోషకరమని తాండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొడంగల్ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందారం ప్రశాంత్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ మరియు తండా సర్పంచ్ మూడవత్ సునీత రాజుల చేతుల మీదుగా తండా కు చెందిన రామావత్ మంగ్లీ బాయి/మోహన్ నాయక్ మోడల్ ఇందిరమ్మ ఇండ్లను అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కే ఆదర్శంగా నిలుస్తున్న కొడంగల్ నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇలాంటి మోడల్ ఇందిరమ్మ ఇండ్లు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయని చైర్మెన్ నందారం ప్రశాంత్ పేర్కొన్నారు . గత 10 సం/ కాలంలో తెలంగాణ రాష్టాన్ని పరిపాలించిన ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క నిరుపేదkకుటుంబానికి అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇచ్చారా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజా పాలన అందిస్తూ ప్రతి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించడం జరుగుతుందని తెలిపారు. వీరితో పాటు తండా ఉపసర్పంచ్ శంకర్ నాయక్, గోపాల్ నాయక్ లతోపాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తాండవసులు తదితరులు పాల్గొన్నారు .

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles