ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ భీమ న్యూస్ ప్రతినిధిడెస్క్

 

ఎద్దు ఏడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం సుభిక్షంగా ఉండదు అని నేను బలంగా నమ్ముతాను

అందుకే రైతుల సంక్షేమం విషయంలో ఎక్కడా లోటు రాకుండా

రైతుల కళ్లలో ఆనందం చూడాలని ఇవాళ రైతు భరోసా నిధులు విడుదల చేశాం

45 రోజుల్లో మూడు విడతలుగా 9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం

పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల కోసం ప్రతీ నెల రూ. 2533 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన
28 నెలల్లో ప్రతీ నెల రూ.5500 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నాం

పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించుకుంటున్నాం

ప్రజా ప్రభుత్వంలో రైతు సంక్షేమం కోసం రెండేళ్లలో లక్ష కోట్లకుపైగా ఖర్చు చేశాం

దేశంలోనే వరి ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది

వ్యవసాయంలో మార్పు రావాలి. రైతులు పంట మార్పిడి విధానం అనుసరించాలి

గతంలో ప్రాంతాల వారీగా వివిధ రకాల పంటలు పండించేవారు.

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పండ్ల తోటలు ఎక్కువగా కనిపించేవి

వరి ఒక్కటే కాదు… అన్ని రకాల పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది

ఈసారి 71 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశాం

కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనడం లేదు.

అందుకే పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించాలి

అందుకు అవసరమైన ప్రణాళికలు తీసుకురావాలి

కేంద్రం ప్రభుత్వ సహకారంతో రైతులు పండించే పంటలను లాభసాటిగా మారుస్తాం

పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరింది

పది లక్షల ఎకరాలు సాగుచేసినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

కొడంగల్ నియోజకవర్గంలో కూడా ఆయిల్ పామ్ కర్మాగారం నిర్మించాలని మంత్రి తుమ్మల గారిని కోరుతున్నా

ఇది మంచి లాభసాటి వ్యవసాయం..

వ్యవసాయంలో 12,728 గ్రామ పంచాయితీలకు అంకాపూర్ స్ఫూర్తి కావాలి

ప్రతీ గ్రామాన్ని అంకాపూర్ లా తీర్చి దిద్ది వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది

అంతర్జాతీయ మార్కెట్ లో పంటలను ఎగుమతులు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది

తెలంగాణలో పండే ప్రతీ పంటను లాభసాటిగా మార్చడమే బంగారు తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం

ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేశాం

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం

పట్టణాల్లోనూ మహిళా సంఘాల సభ్యుల సంఖ్యను పెంచండి

ఇప్పటి వరకు బ్యాంకు లాంకేజీల ద్వారా 57 వేల కోట్ల రుణాలు అందించాం

అదానీ అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలు సోలార్ విద్యుత్ తయారు చేస్తున్నారు

ఆడబిడ్డలు ఆర్థికంగా నిలబడాలి…

ఆడబిడ్డలకు ఆర్థికంగా అర్ధ భాగస్వామ్యం వచ్చినప్పుడే దేశ ఎకానమీ అభివృద్ధి చెందుతుంది

మీరు ఆర్థికంగా నిలబడండి.. ఎదగండి.. మీ అభివృద్ధి కోసం ఇక్కడి నుంచైనా నిధులు తెస్తా

విద్యా కమిషన్ సూచన మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రారంభిస్తాం

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చి దిద్దుతాం

ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చేస్తాం

ఏటీసీలు ఏర్పాటు చేసి యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నాం

నైపుణ్యం ఉన్న విద్య వైపు మనం అడుగులు వేయాలి

వ్యవసాయంలో కొత్త విధానాలు అనుసరించాలి

దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎరువుల కొరత వచ్చే ప్రమాదం ఉంది

కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీని కలిసి మన రాష్ట్రానికి అత్యధిక యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేయాలి

ఇది రాజకీయాలకు సమయం కాదు.. సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన సమయం.

ఎన్నికలప్పుడే రాజకీయాలు… ఎన్నికలు ముగిసాక రాష్ట్ర అభివృద్ధినే ముఖ్యం.

ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు… రైతుల కోసం

నేను వివక్ష చూపను.. నాది వివక్ష చూపే తత్వం కాదు

మేం పేదల కోసం పని చేస్తాం తప్… రాజకీయ నాయకుల కోసం కాదు

వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చారో చర్చిద్దాం రండి

పదేళ్లు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించారు.. ఇప్పుడు పదేళ్లు ప్రజలు మమల్ని ఆశీర్వదిస్తారు.

2029 లో మళ్లీ అధికారం మాదే

వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నా

కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన సభ్యులుగా ఉంటున్నారు

ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వండి

మార్పు చేసి చూడండి.. మంచి జరుగుతుందో లేదో చూడండి

మీర అడ్డుకుంటే ఏదీ ఆగదు

మళ్లీ 2029 లో వస్తాం… సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తాం

సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం మాకు లేదు

119 నియోజకవర్గాలతో సమానంగా చూస్తాం.

సిద్దిపేట నియోజకవర్గంలో శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాల వివరాలు:

వావ్.. డూప్లెక్స్ ఇందిరమ్మ ఇల్లు !

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles