శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి / పరిగి :
ఫీజు బకాయిలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు సరికాదని, దీని వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)ఎస్ఎఫ్ఐ వికారాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి చాకలి అనిల్ ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై భారం సరికాదు: ఫీజు బకాయిలను ముందుగా విద్యార్థుల నుండి వసూలు చేసి, ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన తర్వాత తిరిగి విద్యార్థులకు చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమని చాకలి అనిల్ పేర్కొన్నారు. ఇది పేద విద్యార్థుల చదువులకు గొడ్డలిపెట్టు లాంటిదని, వారిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హామీలతో కళాశాలలు విద్యార్థులను చేర్చుకున్నారని, ఇప్పుడు ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో ఆ భారం విద్యార్థులపై వేయడం సరైనది కాదన్నారు.

పేద విద్యార్థులకు నష్టం: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం దాదాపు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఎదురుచూస్తున్నారని అనిల్ తెలిపారు. ఈ తీర్పు వల్ల వారంతా తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఫీజు బకాయిల కోసం ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి వేధింపుల వల్ల గతంలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.

ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలి: ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోంది. ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని, ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని అనిల్ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును పునఃసమీక్షించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! V C Sajjanar IPS హెచ్చరిక
కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త! V C Sajjanar IPS హెచ్చరిక
కొడంగల్ మండలం నాగారంలో వైభవంగా దేవతా మూర్తుల ప్రతిష్ఠాపన మహోత్సవం


