యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేష్
ఘనంగా స్వయం పరిపాలన వార్షికోత్సవం కార్యక్రమాల వేడుకలు
వార్షికోత్సవం వేడుకల్లో అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
శ్రీ బల భీమ న్యూస్ – కొడంగల్ :

విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన అని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి మల్లేష్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఎన్కెపల్లి UPS పాఠశాలలో స్వయం పరిపాలన వార్షికోత్సవం కార్యక్రమాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం పరిపాలనలో విద్యార్థులు అధికారులుగా, ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.


అనంతరం వార్షికోత్సవం వేడుకల్లో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించారు. పాఠశాల ప్రగతి విద్యార్థుల విద్యాభివృద్ధిని ప్రశంసించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తపస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు బాకారం మల్లయ్య , యుటిఎఫ్ మండల అధ్యక్షుడు గౌరారం గోపాల్, తపస్ మండల అధ్యక్షులు బాకరం చంద్రశేఖర్, పి ఆర్ టి యు నాయకులు మునిరోద్దిన్, వడిచర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ గౌడ్, పి టి ఐ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేష్, ఉపాధ్యాయులు జ్యోతి పరమేశ్వరి, నరేష్,గ్రామ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పూజారి నర్సిములు, గ్రామ కమిటీ మహిళా సంఘాల సభ్యులు మానెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు.
జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు
జిల్లాలో స్కానింగ్ సెంటర్ ఆగమాగం.. కడుపు నొప్పికి వస్తే గర్భవతి అని తప్పుడు రిపోర్టు


