కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు

శ్రీ భీమ న్యూస్కొడంగల్ :

వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కొడంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం సాయంత్రం చైర్మన్ నివాసంలో కొడంగల్ ప్రెస్ క్లబ్ సభ్యులు అరిగె అనంత ప్రసాద్, పృథ్వీరాజ్, శ్రీకాంత్, ఆనంద్ రాజ్, ETV నరేందర్ , బొంకూర్ నరేష్ కుమార్ . బొంరాస్ పేట సాక్షి రిపోర్టర్ అంజిలప్ప సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు .

మున్సిపల్ కార్యాలయంలో

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ సమక్షంలో కార్యాలయ సిబ్బంది కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

కౌన్సిలర్ సమక్షంలో

మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైస్ చైర్మన్ శంకర్ నాయక్ కౌన్సిలర్లు కృష్ణంరాజు, సయ్యద్ హమీద్ అలీ, దాము, బత్తుల నరసింహలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ప్రశాంత్ చేతుల మీదుగా కట్ చేసి బాణ సంచాలు కాలుస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై తిరుపతిరెడ్డి జై నందరామ్ ప్రశాంత్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు.

హుస్సేన్ పూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో

మండల పరిధిలోని హుస్సేన్ పూర్ గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ గ్రామపంచాయతీ నాలుగో వార్డు మెంబర్ అంజిలప్ప నాయకులు అంజలి రెడ్డి, శేఖర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, కొడంగల్ మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ జన్మదిన వేడుకల సందర్భంగా బాణాసంచాలు కాలుస్తూ కేక్ కట్ చేసి ఎంతో సంబరంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు.

తాండూరు ఆర్టీసీ డిపోలో BCసంక్షేమ సంఘం ఏర్పాటు.

విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన

విద్యార్థుల కలలకు పునాది స్వయం పరిపాలన

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles