భగత్ సింగ్,రాజ్గురు సుఖదేవ్ గార్ల వర్ధంతి సందర్భంగా మై భారత్ ఆధ్వర్యంలో ర్యాలీ
శ్రీ బల భీమ న్యూస్ – కులకచర్ల

భారతదేశ స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే అలుపెరుగని పోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప పోరాట యోధులు బ్రిటిష్ వారి క్రూరత్వానికి దేశం కోసం ఉరికంబాన్ని కూడా ముద్దాడి ప్రాణాలను అర్పించిన మహా బావులు భగత్ సింగ్,రాజ్గురు సుఖదేవ్ గార్ల వర్ధంతి సందర్భంగా సోమవారం పల్లవి కాలేజీ నుండి కొడంగల్ చౌరస్తా వరకు మై భారత్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి వారి పోరాటాలను బలిదానాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు బిజేపి జిల్లా నాయకులు పెంటయ్య గుప్తా,ముకుంద నాగేశ్వర్,అనిల్, పల్లవి కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.


