శ్రీ బల భీమ న్యూస్ ప్రతినిధి – పరిగి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకాల అమలులో తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపించిన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపధ్యంలో టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులు, బిజేపి జిల్లా నాయకులు పెంటయ్య గుప్తా,జి.కేశవులు,పరిగి పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ రెడ్డిలతో పాటు పరిగి మండలానికి చెందిన బీజేపీ నాయకులను సోమవారం ఉదయం పరిగి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.




