కాలినడక విద్యార్థులపై కనికరించిన మణికాంత్

  • పేద విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ
  • సైకిళ్ల పంపిణీ ఏర్పాటుచేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక
  • దాతలైన సంస్థలకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు

శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్

 

సైకిళ్లు అందుకున్న పలు గ్రామాల విద్యార్థినిల్లో ఆనందం వె వెల్లివిరిసిన ఆనందం
వికారాబాద్ జిల్లా దుద్యాల ఉన్నత పాఠశాల పేద విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్ళ పంపిణీ చేసి తన ఉదారత్వాన్ని చాటుకున్నాడు ఓ దాత. హైదరాబాదుకు చెందిన మణికాంత్ అమెరికాలో ఉంటూ తన ప్రాంతంలోని రాష్ట్రంలోని పేదలకు ధనవంతు సహాయం అందివ్వాలని ముందుకు వస్తున్నారు. ఈ మేరకు దుద్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పలువురికి ఉచితంగా సైకిలను పంపిణీ చేసి తన సేవా సేవాభావాన్ని చాటుకున్నారు 55వేల విలువచేసే పది మారుమూల ప్రాంత పేద విద్యార్థినిలకు ఉచితంగా అందజేశారు ఈ సైకిల్ లను శుక్రవారం పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కే.రవీందర్ గౌడ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లప్ప గారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ పాఠశాలకు ఇదివరకు 45 మంది పేద విద్యార్థినిలకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేయడంలో కిసాన్ బందు, యూత్ ఫర్ సేవా తదితర సంస్థల సహకారంతో సైకిల్లతోపాటు బ్యాగులు, నోటు పుస్తకాలు, ఇతర అభ్యసన సామాగ్రిని ఉచితంగా అందిస్తున్నట్లు తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కె .రవీందర్ గౌడ్ పేర్కొన్నారు. పాఠశాలకు అందిస్తున్న వివిధ సంస్థల ఉచిత సేవలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్లప్ప కొనియాడారు. ఈ మేరకు ఆయా సంస్థలకు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

సైకిళ్ల ఉపయోగాన్ని ఉపాధ్యాయ బృందం విద్యార్థినులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్’ హెడ్మాస్టర్ మల్లప్ప ఉపసర్పంచ్ సంజీవ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ వార్డు సభ్యులు బసిరెడ్డి రాజు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మెరుగు వెంకటయ్య కాజా పాషా సత్యం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రాములు ‘ముకుంద రెడ్డి ‘శ్రీనివాస్ ‘రమేష్’ రవి నాయక్’ మాధవి మేడం ‘చంద్రశేఖర్ రెడ్డి’ సుధాకర్ రావు అభయ్ కుమార్ వహీద్ వెంకటయ్య, అలాగే అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles