శ్రీ బల భీమా న్యూస్ ప్రతినిధి – కొడంగల్

తెలంగాణ శ్రీ పరభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో అర్చకులు పూజా కార్యక్రమం నిర్వహించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఈ పూజా కార్యక్రమం నిర్వహించడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం లోని దుద్యాల మండల యూత్ అధ్యక్షుడు లగచర్ల సురేష్ కేటీఆర్ ను కలిసి శ్రీ పరభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ సందర్భంగా కొడంగల్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం . రాబోయే రోజులలో నియోజవర్గంలో పార్టీ పటిష్టతకు మరింతగా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది .




