శ్రీ బల భీమా న్యూస్ డెస్క్ – కొడంగల్
శ్లో॥ మంగళం వేంకటేశాయ, మంగళం పరమాత్మనే, శ్రీ కొడంగల్ నివాసాయ, శ్రీనివాసాయ మంగళం ॥
కొడంగల్ శ్రీ మహా లక్ష్మి వెంకటేశ్వర స్వామి 46వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడై పేదల తిరుపతిగా ప్రసిద్ది చెందిన కొడంగల్ పట్టణములో కొలువు తీరిన శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ ఆస్థాన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి .

భాగంగా 2వ రోజు రాత్రి ఆచార్యస్వాములు స్వామివారిని హంస వాహనం పై శ్రీ సరస్వతీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు . ఈ అవతారం శ్రీనివాసుడి జ్ఞాన స్వరూపాన్ని సూచిస్తుంది. హంస వాహనంపై సరస్వతి అలంకారంలో మలయప్ప స్వామి భక్తులకు సాక్షాత్కరించారు. హంస వాహన సేవలో శ్రీ మలయప్ప స్వామి జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. అందుకే మహనీయులను పరమహంసగా పోలుస్తారు.

కొడంగల్ శ్రీ వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు బాలాజీ ఆడుతా పాడుతా తీయగా కార్యక్రమాలలో మల్లేష్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలతో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
http://www.youtube.com/@sribalabheema7188
ఈ లింక్ ను ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ ను Subscribe చేయండి



