జనంలో రీల్స్ పిచ్చి రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది.

 

వ్యూస్ కోసం కొందరు ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా దిల్లీలో (Delhi) అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

తుపాకీతో స్టంట్ చేయబోయి ఓ యువకుడు మృతి చెందాడు. లోడ్ చేసిన గన్తో రీల్ చేస్తుండగా.. అది పేలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

మృతుడిని తూర్పు దిల్లీకి చెందిన పవన్గా గుర్తించారు.

పవన్ ఈ రీల్ చేస్తుండగా పక్కనున్న స్నేహితుడు దాన్ని రికార్డ్ చేశాడు. బటన్ ఎలా నొక్కాలో మిత్రుడు చెబుతుంటే.. పవన్ తుపాకీని లోడ్ చేశాడు. ఆ తర్వాత గన్ ను ఛాతీకి గురిపెట్టుకొని కెమెరా వైపు చూసి నవ్వాడు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి ‘కాల్చొద్దు అన్నా..’ అని చెప్పినప్పటికీ.. పవన్ కంగారులో ట్రిగ్గర్ నొక్కేశాడు. దీంతో బుల్లెట్ గుండెల్లోకి దూసుకెళ్లి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ తుపాకీ వీడియో రికార్డు చేసిన పవన్ స్నేహితుడిదేనని పోలీసులు తెలిపారు. దానికి లైసెన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles