కొడంగల్ లో అస్తవ్యస్తంగా రోడ్డు నిర్మాణ పనులు : తరచుగా ప్రమాదాలు

  • కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
  • వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పట్టించుకోని వైనం
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
  • బల భీమా న్యూస్ డెస్క్ – కొడంగల్

వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి తాండూరు వెళ్లే ప్రధాన రహదారి రోడ్డు విస్తరణలో భాగంగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా వాహనదారులు నిత్యం పలు ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . కొడంగల్ నుంచి తాండూరుకు నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటారు . రోడ్డు మరమ్మతులు నిర్లక్ష్యంగా సాగుతుండడంతో ద్విచక్ర వాహనదారులు నిత్యం దుమ్ము ధూళితో సాహసం చేస్తూ పలుమార్లు వాహనాలు అదుపుతప్పి ప్రాణాలు సైతం పోతున్నాయని కొడంగల్ వాసులు వాపుతున్నారు .

ఈ క్రమంలోనే కొడంగల్ లో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్ కు సంబంధించిన సిబ్బంది రోడ్డుపై ఇష్టానుసారంగా వాటర్ వెదజల్లడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురైన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ఏ ఒక్క అధికారి గాని కాంట్రాక్టర్ గాని పట్టించుకున్న దాఖలాలు లేవని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్మాణ పనులలో నిర్లక్ష్యం చేస్తున్న కాంట్రాక్టర్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు .

http://www.youtube.com/@sribalabheema7188

Open Link And Subscribe To Sri bala bheema news

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles