బల భీమా న్యూస్ డెస్క్ – కొడంగల్
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండల పరిధిలోని అప్పాయిపల్లి గ్రామ శివారులోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర )పాఠశాల మరియు కళాశాలలో దోమల నివారణ చర్యలు చేపట్టినట్లు కొడంగల్ ఫైలేరియా యూనిట్ అధికారి పక్కిరప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి మరియు జిల్లా కీటక జనిత వ్యాధుల నివారణ అధికారి (డిప్యూటీ డి ఎం హెచ్ ఓ) డాక్టర్ రవీంద్ర యాదవ్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం గురుకుల పాఠశాలలో ని అన్ని గదులు మరియు బాత్రూంలలో దోమల నివారణ మందులను పిచికారి చేయడం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ సమక్షంలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత మరియు దోమల నివారణ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాందాస్ మరియు హెల్త్ అసిస్టెంట్ మధుసూదన్ రెడ్డి, రేష్మ ,జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ మేరీ జోన్స్ , పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .



