పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత – మార్నింగ్ వాక్ లో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్

శ్రీ బల భీమా న్యూస్ డెస్క్కొడంగల్

పరిసరాల పరిశుభ్రత మన అందరి బాధ్యత అని ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని కొడంగల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ నాయక్ అన్నారు .

మంగళవారం ఉదయం మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులోని పాత కోడంగల్ తండాలో మార్నింగ్ వాక్ లో భాగంగా పర్యటించారు.ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు . అదేవిధంగా మన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అంటూ పరిసరాలు

పరిశుభ్రంగా ఉన్నప్పుడే మన ఆరోగ్యం ఎంతో బాగుంటుందని పలు సూచనలు చేశారు.ప్రస్తుత కాలంలో దోమల బెడత విపరీతంగా పెరగడం కారణంగా అనేకమంది పలు రోగాల బారిన పడి అనారోగ్యాలకు గురి అవుతున్నారని అందుకు మనందరం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు .పాత కొడంగల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై సంబంధిత శాఖ కాంట్రాక్టర్లు అధికారులతో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని కోరారు. గ్రామంలో మురుగు కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని వెంటనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వీడి పనులు చేపట్టాలని సూచించారు . వీరితోపాటు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు . 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles