శ్రీ బల భీమా న్యూస్ డెస్క్ –కొడంగల్
నూతనంగా ఎన్నిక కాబడిన కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ను, వైస్ చైర్మన్ శంకర్ నాయక్ ను కొడంగల్ ఐసిడిఎస్ ఇన్చార్జి సిడిపిఓ నిర్మల సమక్షంలో తమ సిబ్బంది మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు .

గత కొన్ని సంవత్సరాలుగా ఐసిడిఎస్ నూతన కార్యాలయం నిర్మాణ దశలోనే పెండింగ్లో ఉందని త్వరితగతిన పనులు పూర్తి చేసి కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసేందుకు ఆసక్తి చూపాలని వారు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు . అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అందిస్తున్న సంక్షేమ పథకాలు గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పౌష్టిక ఆహారంపై వారు క్లుప్తంగా వివరించారు .
దీనిపై వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్మన్ అందరం ప్రశాంత్ సదరు బిల్డింగ్ నిర్మాణ కాంట్రాక్టర్కు ఫోన్ ద్వారా సంప్రదించి వెంటనే పనులను పూర్తిచేయాలని ఆదేశించారు సమావేశంలో ఐసిడిఎస్ కార్యాలయ సూపర్వైజర్లు మణిమాల, ప్రభ ,మంజుల, దివ్య ,సుచిత్ర ,సౌమ్య , DEO రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .


