- అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద రూ.5,681 కోట్లకు గ్రీన్ సిగ్నల్
శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
హైదరాబాద్, మే 22: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కింద రాష్ట్రానికి ఏకంగా రూ.5,681 కోట్ల నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తుది ఆమోదం తెలిపింది. ఇందులో వరంగల్‌కు రూ.4,674 కోట్లు, కరీంనగర్‌కు రూ.840 కోట్లు, ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ అభివృద్ధికి రూ.166 కోట్ల నిధులు మంజూరు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వెల్లడించారు.
ఈ మేరకు బండి సంజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు నగరాల ఆధునీకరణకు ఈ నిధులు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.

వరంగల్‌కు భారీ కేటాయింపు
వరంగల్ నగర మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునీకరణ కోసం రూ.4,674 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుతో నగరంలోని డ్రైనేజ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అధికారులు భావిస్తున్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలతో వరంగల్ నగర రూపురేఖలు మారనున్నాయని పేర్కొంటున్నారు.
కరీంనగర్ అభివృద్ధికి రూ.840 కోట్లు
కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధి కోసం రూ.840 కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ఆమోదించింది. ఇందులో భాగంగా మోడల్ రోడ్లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, జంక్షన్ అభివృద్ధి పనుల కోసం రూ.630 కోట్లను వినియోగించనున్నారు.
అదేవిధంగా వర్షపు నీటి కాలువల పునరుద్ధరణ, వరద నివారణ చర్యల కోసం రూ.130 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, డంప్ యార్డ్ పునరుద్ధరణ కోసం మరో రూ.80 కోట్లను కేటాయించనున్నారు.
కారిడార్ అభివృద్ధికి నిధులు
ఖమ్మం-వరంగల్-కరీంనగర్ కారిడార్ అభివృద్ధి కోసం రూ.166 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారిడార్ ద్వారా మూడు ప్రధాన జిల్లాల మధ్య రవాణా, పారిశ్రామిక, వాణిజ్య అభివృద్ధికి ఊతం లభించనుందని అధికారులు చెబుతున్నారు.
ప్రధాని ప్రత్యేక చొరవ: బండి సంజయ్
తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనల్లో కరీంనగర్ అభివృద్ధికి సంబంధించిన అంశాలు లేకపోయినా.. కరీంనగర్‌ను ప్రాజెక్టులో చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని బండి సంజయ్ వెల్లడించారు. తాను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో పాటు డీపీఆర్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు.
అపెక్స్ కమిటీ సమావేశం అనంతరం కేంద్ర అధికారుల క్షేత్రస్థాయి పర్యటనల తర్వాత ఈ నిధులకు తుది ఆమోదం లభించిందన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ
ఈ ప్రాజెక్టులతో తెలంగాణలోని పలు నగరాలు సంపూర్ణంగా ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఇప్పటికే తొలి విడతగా రూ.1,420.26 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
|
మరిన్ని తాజా వార్తల కోసం శ్రీ బల భీమ న్యూస్ ని Follow చేయండి Youtube లో Sri bala bheema news అని సర్చ్ చేసి Subscribe చేయండి |
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



