శ్రీ బల భీమ న్యూస్ / కొడంగల్ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్ఐవి/ఎయిడ్స్, సిఫిలిస్ వంటి లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర, హెచ్ఐవి/ఎయిడ్స్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర యాదవ్, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు హెచ్ఐవి వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి వచ్చిన తరువాత ఇతరులకు వ్యాపించకుండా పాటించాల్సిన నియమాలను వివరించారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీకి హెచ్ఐవి ఉన్నట్లయితే పుట్టబోయే శిశువుకు వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన వైద్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అలాగే సుఖవ్యాధులు, లైంగిక వ్యాధులకు సంబంధించిన చికిత్సలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్ఐవి బాధితులకు తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టీ (ART) సెంటర్ ద్వారా ఉచితంగా మందులు అందిస్తున్నామని చెప్పారు. బాధితులు ప్రతి నెలా క్రమం తప్పకుండా మందులు వినియోగిస్తే సాధారణ వ్యక్తుల మాదిరిగానే ఆరోగ్యంగా జీవించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ అంశాలపై అంగన్వాడీ వర్కర్లకు గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డెమో శ్రీనివాసులు, దిశ మేనేజర్ నరేందర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మీ శ్రీ బలబీమ న్యూస్ ఛానల్ ను Like చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ Subscribe చేయండి .
ఈ లింకును ఓపెన్ చేసి మా మీ ఛానల్ ను Subscribe చేయండి ధన్యవాదాలు.
www.youtube.com/@sribalabheema7188

ప్రియమైన మిత్రులారా…
మన శ్రీ బల భీమ యూట్యూబ్ ఛానల్ మీ కోసం నిత్యం తాజా వార్తలు, విశేషాలు అందిస్తోంది
ఇంకా సబ్‌స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడే చేయండి!
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ప్రతి అప్డేట్‌ను వెంటనే తెలుసుకోండి
మీ ఒక సబ్‌స్క్రిప్షన్…
మన ఛానల్ ఎదుగుదలకు పెద్ద బలం
మీ మద్దతు – మన విజయానికి పునాది
ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేయండి… ఇతరులతో కూడా షేర్ చేయండి!
కలిసి ఎదుగుదాం… శ్రీ బల భీమ న్యూస్ ను మరింత ముందుకు తీసుకెళ్లుదాం
www.youtube.com/@sribalabheema7188



