ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మెంబర్షిప్ ఉచితం.

ఇంటర్నేషనల్ మెంబర్షిప్ ఇకపై ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు . తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల చెందిన ఆర్యవైశ్య సభ్యులందరూ ఉచితంగా ఎలాంటి రుసుము లేకుండా ఇందులో సభ్యత్వం తీసుకునే విధంగా ముషీరాబాద్ ఆర్యవైశ్య భవన్ లో ఫ్రీ మెంబర్ షిప్ కి సంబంధించిన వెబ్ సైట్ ను ఆవిష్కరించడం జరిగిందని వారు తెలిపారు . రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ గుప్తా ఆధ్వర్యంలో ఈ స్కీమును ఆవిష్కరించడం ఎంతో శుభ పరిణామం అని వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటకం శివకుమార్ గుప్తా , కొడంగల్ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ అడ్వైజర్ రిపోర్టు చైర్మన్ గంజి రాజమౌళి గుప్తా గారు నేషనల్ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles