అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల నుంచి చలివేంద్రం ఏర్పాటు చేసి పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని ఫౌండర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు . సోమవారం కొడంగల్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై వికారాబాద్ జిల్లా డిప్యూటీ డాక్టర్ రవీంద్ర యాదవ్ స్థానిక ఎస్సై జీవి సత్యనారాయణ సమక్షంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో సంతోషకరమని వారు హర్షం వ్యక్తం చేశారు .
గత నాలుగు సంవత్సరాలుగా వేసవికాలంలో మండుటెండలో రోడ్డుపై వెళ్లే పాదాచారులకు దాహార్తిని తీర్చడం ఎంతో పుణ్యకార్యం అని అలాంటిది ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమే అని పేర్కొన్నారు . చలి లేకుండా రోడ్డుపై దిక్కుమక్కు లేని అనాధలను చేరదీసి వాళ్ల కనీస అవసరాలు తీర్చడం దేవుడు ఇచ్చిన గొప్ప వరమని అమ్మ నాన్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు . ఇలాంటి సేవ దృక్పథం కలిగిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాళ్ళు అభిప్రాయపడ్డారు .
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ బృందం సభ్యులు బొంకూర్ నరేష్ కుమార్ అంగడి రాయచూర్ చంద్రప్ప, అనిల్, బాకారం చంద్రశేఖర్, అరిగే ఓం ప్రకాష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు .


