కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి 46వ వార్షిక బ్రహ్మోత్సవాలు

శ్రీవారి బ్రహ్మొత్సవములు-2026

శ్రీమత్ కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి 46వ వార్షిక బ్రహ్మోత్సవ ఆస్థాన సేవలు 16-03-2026 నుండి 23-03-2026 వరకు శ్రీ వైఖనసాగమ శాస్త్ర ప్రకారంగా అత్యంత వైభోపేతముగ జరుగును

వికారాబాద్ జిల్లా పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ లోని శ్రీ మహా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయం లో వార్షిక బ్రహ్మోత్సవ ఆస్థాన సేవలలో భాగంగా, ఈ రోజు మొదటి రోజు (16-03-2026) ఉదయం 10.00 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను వజ్ర వైడూర్యాలు మరియు పూలమాలలతో అలంకరించి తిరుచ్చి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు విశేష పూజలు నిర్వహించారు, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి నిర్వహించబడే స్వామి వారి బ్రహ్మోత్సవ ఆస్థాన సేవలను భక్తులు దర్శించి, శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి. అలాగే ప్రతిరోజు రాత్రి 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు బాలాజీ ఆడుతా పాడుతా తీయగా అనే సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడును.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles