అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం నశించాలి

  • డిప్యూటీ తహశీల్దార్ కు మెమోరాండం
  • సిపిఐ నియోజకవర్గ నాయకులు గంటి సురేష్ కుమార్

కొడంగల్

అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదం నశించాలని దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్ పిజి గ్యాస్ సిలిండర్ దరలు తగించాలని,తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమవుతున్నారని సిపిఐ నియోజకవర్గ నాయకులు గంటి సురేష్ కుమార్ అన్నారు, సోమవారం కోడంగల్ లోని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ అనితకు మెమోరండం అందించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు తీవ్రమవుతున్నాయని, గంటగంటకూ పరిస్థితి మారిపోతుందన్నారు, యుద్ధోన్మాదంతో చెలరేగుతున్న అమెరికా, ఇజ్రాయిల్‌ను నియంత్రించేందుకు ఇరాన్‌ ప్రతిఘటన దాడులు చేస్తోందన్నారు, యుద్ధం ప్రారంభంతో ప్రజలపై పెను భారం పడుతుంది ఒకవైపు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటడమే కాక, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయన్నారు, ప్రజలపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు, ఒకవైపు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పేరిగి సామాన్యుడికి మహాభారంగ మారుతున్నయన్నారు, గ్యాస్ కొరతతో ఇండ్లల్లో మరియు హోటళ్లలో కట్టెలతో వంటలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు, మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని అన్నారు, ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకు లొంగిపోవడమే కారణమని గతంలో మనకు రష్యా నుంచి సబ్సిడీ ధరకు చౌకగా లభిస్తున్న చమురును అమెరికాతో వాణిజ్య ఒప్పందం కోసం కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకుందన్నారు, రష్యా మాదిరిగానే డాలర్లు కాకుండా ఇరుదేశాల కరెన్సీ తో మనకు చమరును అమ్ముతున్న ఇరానును, సైతం అమెరికా, ఇజ్రాయిల్ ఒత్తిడితో వదులుకున్నామన్నారు, ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు పరోక్షంగా మద్దతు తెలుపుతుందన్నారు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం దీనంతటికీ బిజెపి ప్రభుత్వం కరణం అన్నారు. ఈ కార్యక్రమంలో బడంపల్లి బాబు. శంకర్ నాయక్. బాబా. పాండ్యా నాయక్. రెడ్యా నాయక్. చందు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles