SSC పరీక్షల స్పాట్ రేట్లు 50% పెంచాలి

* గత సంవత్సరం స్పాట్ బకాయిలు విడుదల చేయాలి
* టిఎస్ యుటిఫ్

బొమ్మరాస్పేట్, 17 మార్చి

పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లను 50 శాతం పెంచాలని, గత సంవత్సరం మూల్యాంకనం చేసిన ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని టిఎస్ యుటిఎఫ్ బొంరాస్ పేట ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు . 2018 లో రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ రేట్లు సవరించింది.

గత ఎనిమిది సంవత్సరాలుగా అవే రేట్లు అమలులో ఉన్నాయని, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం రేట్లు రెండు సార్లు పెంచారని కనుక పదో తరగతి మూల్యాంకనం రేట్లను కూడా ఆమేరకు సవరించాల్సిన అవసరం ఉందని టిఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరారం గోపాల్ , ఎండి అలీముద్దీన్ అన్నారు .

గత సంవత్సరం మూల్యాంకనం విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు నేటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున అంతకు ముందే గత సంవత్సరం బకాయిలు చెల్లించాలని లేదంటే స్పాట్ కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles