కొడంగల్ మున్సిపల్ లో ప్రోటోకాల్ పాటించని అధికారులు

  • అధికారుల తీరుపై మండిపడిన కౌన్సిలర్లు

కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో అధికారుల తీరుపై BRS పార్టీ రెండవ వార్డు కౌన్సిలర్ శ్రీవాణి మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు . సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్లకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు . గత కొన్ని రోజులుగా మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న అధికార కార్యక్రమాలకు గాని ఇతరత్రా కార్యక్రమాలకు గాని మున్సిపల్ కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరించడం తగదని హెచ్చరించారు . దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు . ఇకపై అధికారికంగా మున్సిపల్ కార్యాలయంలో ఏ కార్యక్రమాలు జరిగినా సమావేశాలు జరిగిన ప్రతి ఒక్క కౌన్సిలర్లకు సమాచారం అందించాలని కోరారు . వీరితో పాటు BRS పార్టీ మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు .

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles